Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పంజాబ్ రాష్ట్రంలోకి ప్రవేశానికి కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు లేదా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే ఈ సోమవారం నుంచి పంజాబ్‌లోకి ప్రవేశానికి అనుమతించనున్నారు. ఈ మేరకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ శనివారం కరోనా పై రివ్యూ సమావేశం నిర్వహించి ఈ ప్రకటన చేశారు. కాగా, పంజాబ్‌లో ఇటీవల స్కూళ్లు, కాలేజీలను తెరిచారు. అయితే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నవారు లేదా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఉపాధ్యాయులు మాత్రమే స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష టీచింగ్‌కు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ క్లాసులను ఎంచుకునే అవకాశం కూడా విద్యార్థులకు ఉందని తెలిపారు. అయితే కొన్ని రోజులుగా పంజాబ్ లో విద్యార్థులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం పంజాబ్ లో మొత్తం 89 కొత్త కేసులు వచ్చాయి.