Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హుజురాబాద్ లో ఈనెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ముందుగా 15 మందికి మాత్రమే దళిత బంధు రుణాన్ని అందజేస్తారని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లా డుతూ దళిత బంధు పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష చేశామని చెప్పారు. దళిత బంధు పథకం అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. లబ్దిదారులకు నగదు నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతుందని చెప్పారు. ఈనెల 16న మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామం బహిరంగ సభ జరగనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 15 మంది దళితులకు దళితబంధు పథకం చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారని పేర్కొన్నారు.