Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లోని పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంకో వారం రోజులో ఆ దేశన్ని మొత్తం తాలిబన్లు ఆక్రమించుకుంటారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడిన రికార్డెడ్ సందేశం మీడియాలో ప్రసారమైంది.
అధ్యక్షుడు మాట్లాడుతూ తీవ్రమైన అస్థిరత ప్రమాదంలో ఆఫ్ఘనిస్థాన్ ఉందన్నారు. ఈ పరిస్థితులపై స్థానిక నేతలతోనూ, అంతర్జాతీయ భాగస్వాములతోనూ తాము చర్చిస్తున్నామని చెప్పారు.
సాయుధ దళాలను మోహరించడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశంలో హింసను రూపుమాపుతానని, మరింత రక్తపాతాన్ని జరగనివ్వనని అన్నారు.