Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎంపీ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభం కాబోతుందని ప్రకటించారు. బీజేపీ నాయకులు రైతు బంధు ప్రారంభించినపుడు అపోహలు సృష్టించారన్నారు. ఇప్పుడు దళితబంధుపై కూడా వారు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారన్నారు. దళిత బంధుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం శక్తి మేరకు ఒక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తోందని చెప్పారు. బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని అంటున్నారని, అలాంటప్పుడు ఆయన ఢిల్లీ నుంచి మరో రూ.40 లక్షలు తీసుకురావాలన్నారు. అలా చేస్తే సంతోషిస్తామని, ప్రధాని మోడీ, బండి సంజయ్‌లకు పాలాభిషేకం చేస్తామని అన్నారు.
ప్రతి గ్రామం, మున్సిపాల్టీలలో ప్రత్యేక అధికారి నియామకం జరుగుతుందని.. గ్రామసభలో ప్రజల మధ్యే పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు.