Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,535 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో 16 మంది మృతి చెందగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 18,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్రంలో ఇప్పటి వరకు 19,92,191 మంది కరోనా బారిన పడగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,60,350 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. రాష్ర్టంలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 13,631 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులిటెన్ లో పేర్కొన్నారు.