Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మధ్యప్రదేశ్లో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్టు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో ముగ్గురు మున్సిపల్ సిబ్బంది మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చారిత్రక నేపథ్యం ఉన్న మహారాజా బడా తపాలా కార్యాలయం (పోస్టాఫీస్) భవనంపై జెండా ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీతో భవనంపైకి ఎక్కిన సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ విరిగిపడింది. దాంతో ముగ్గురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తులసీరామ్ సిలావత్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ విక్రమ్ సింగ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం.