Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బర్రెపై లైంగిక దాడి చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగవరం కాలనీకి చెందిన ఆంజనేయులు(45) శుక్రవారం అర్ధరాత్రి అదే కాలనీలోని బాల్రెడ్డికి చెందిన బర్రెల కొట్టంలోకి ప్రవేశించాడు. అక్కడ బర్రెపై లైంగికదాడి చేస్తుండగా బర్రె తోక అతని మెడకు బిగుసుకుపోయింది. దాంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం కొట్టంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ షేక్ షఫీ తెలిపారు.