Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో మతం పేరుతో లబ్ది పొందాలని మోడీ చూస్తున్నాడని కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ దేశం అన్ని మతాల వారిదన్నారు. కేసీఆర్, నరేంద్రమోడీకి గులాంలా మారాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాలు కేసీఆర్ జేబులో నుంచి పెట్టడం లేదని అన్నారు. మైనార్టీల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని, 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బందు పథకం దళితులకు దొఖా చేసే పనే అని అన్నారు.