Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దళితబంధులా.. మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ మైనార్టీ సభ ఓట్ల కోసం పెట్టలేదన్నారు. బీజేపీ దృష్టి లో మైనార్టీలు శత్రువులు అన్నారు. ఎక్కడెక్కడ మైనార్టీలు అధికంగా ఉన్నారో అక్కడే టీఆర్ఎస్ గెలిచింది. అన్నారు. కారును, పతంగిని నమ్ముకుంటే మోసపోయేది ముస్లింలేనని చెప్పారు. కారు స్టీరింగ్ తన చేతిలో ఉందని అసద్ అంటాడు అని.. మరి ఎంపీ రంజిత్ రెడ్డి ట్రిపుల్ తలాక్ కి ఎందుకు మద్దతు ఇచ్చాడు అని ప్రశ్నించారు. మీరు ఇక్కడ ఎంపీలను గెలిపిస్తారు కేసీఆర్ వాళ్ళను తీసుకెళ్లి మోడీ చేతిలో పెడుతున్నాడు అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని తెలిపారు. ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకించిందన్నారు. రాష్ట్రపతి, సీఎం పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యుడీషరీ పవర్స్ కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మైనార్టీ సోదరులు మరిచిపోవద్దు అన్నారు.