Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ ప్రజలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో నివసించే వారికే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. చెబుతున్నట్టు తెలిపారు. కరోనాతో మరణించిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోవిడ్-19 నుంచి వ్యాక్సిన్లే భారీ రక్షణ కవచంలా నిలుస్తాయని రాష్ట్రపతి తెలిపారు. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరించి అర్హులైన వారంతా సత్వరమే వ్యాక్సినేషన్‌కు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి అనుభవం నుంచి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం చాలా ప్రత్యేకమైందన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవబోతున్నాయని.. అమృత మహోత్సవంగా ఈసారి వేడుకల్ని నిర్వహించుకోబోతున్నామన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం మనకు పండగ దినమని చెప్పారు. ఎంతో మంది త్యాగధునల ఫలితం మన స్వాతంత్ర్య కాంక్ష అన్నారు. అందులో మనకు తెలిసినవాళ్లు ఉన్నారు, తెలియని వాళ్లు కూడా ఉన్నారు అని చెప్పారు. అలాంటి గొప్ప వీరులకు నా తల వంచి నమస్కరిస్తున్నాను అని అన్నారు. గత 75 ఏండ్ల పలు రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగామని, భారత భవిష్యత్‌లో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుందని చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుండటం అభివృద్ధి ప్రస్ధానానికి నాంది అని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో తీసుకువచ్చిన పలు సంస్కరణలతో రైతులకు మరింత సాధికారత చేకూరిందని అన్నారు