Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వాతంత్య్ర వేడుకలను బహిష్కరించాలని సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అన్నారు. శనివారం ఆయన పేరిట ఒక ప్రకటన విడుదలయింది. సంవత్సర కాలం పాటు ఆజాదీకీ అమృత్ మహోత్సవాల పేరుతో ప్రజలను ప్రధాని మోడీ మోసం చేస్తున్నారని విమర్శించారు. మేధావులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులపైనా బీమాకోరేగావ్ వంటి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. జైలులో బంధించటంతో పాటు అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే 84 ఏండ్ల వయో వృద్ధుడు స్టాన్‌స్వామి మరణం చోటు చేసుకుందని తెలిపారు.