Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు గతంలో ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉండేవి. అయితే కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. దాంతో గ్రీన్ మంత్ర అనే సంస్థతో టీటీడీ కలిసి క్లాస్ బ్యాగ్స్, సీడ్ ఎంబెడెడ్ కవర్లను తీసుకొచ్చారు. ఇవి పర్యావరణ హిత కవర్లు. ఈ కవర్లను మట్టిలో కలిసిపోయేలా తయారు చేసినట్టు గ్రీన్ మంత్ర సంస్థ చెబుతున్నది. ఈ సీడ్ ఎంబెడెడ్ కవర్లను మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోస్తే తులసి మొక్కలు వస్తాయని ఆ సంస్థ చెబుతోంది.
'పర్యావరణాన్ని కాపాడుకుందాం.. స్వామివారి కృపకు పాత్రులవుదాం` అన్న నినాదంతో ఈ వృక్ష ప్రసాదం కవర్లను గ్రీన్ మంత్ర సంస్థ తయారు చేస్తున్నది. ఈ కవర్ల తయారీకి చెట్ల బెరడు, కంద మూలాలనే ముడి పదార్థాలుగా వాడినట్లు తెలిపారు. అయితే ఈ కవర్లను మట్టిలో పెట్టేంత వరకు డీకంపోజ్ కావని చెప్పారు.