Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరేబియన్ దేశమైన హైతీలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదైంది. ఈ మేరకు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం నేపథ్యంలో హైతీ సముద్ర తీర ప్రాంతంలో అలలు పది మీటర్ల ఎత్తున ఎగసిపడవచ్చని తెలిపింది. భూకంపం ధాటికి హైతీ నైరుతి ద్వీపకల్పంలో పలు ఇండ్లు, స్కూళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. హైతీ పౌర రక్షణ డైరెక్టర్ జెర్రీ చాండ్లర్ దీనిపై స్పందించారు. రెస్క్యూ బృందాలను రంగంలోకి దించామని, ప్రధాని కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. కొందరు మరణించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.