Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా 420 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,52,ది 135కు చేరింది. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,841కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 623 మంది కోలుకోగా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,40,688కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,606 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.