Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వాతంత్ర్య వేడుకల్లో బాంబు దాడుల చేయాలని కుట్ర పన్నిన ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముష్కరులు జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్ధకు చెందినవారిగా గుర్తించారు. ఉగ్రవాదుల నుంచి భద్రతా బలగాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకు న్నాయి. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉగ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు అయోధ్య రామ మందిరం, పానిపట్ చమురు శుద్ధి కర్మాగారం వంటివి టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. నలుగురిలో ఒకరిది యూపీ కాగా మిగిలిన ముగ్గురిది కశ్మీర్ అని అధికారులు తెలిపారు. నలుగురిని విచారిస్తున్నామని.. రానున్న రోజులు మిగితా టెర్రరెస్టులను అరెస్టు అవుతారని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.