Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మద్యం తాగి అనుమానస్పదంగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుతండాకు చెందిన బోడా హరిదాసు (60), బోడా మల్సూర్ (57), బోడా భధ్రు (30)లు కూలి పనులు చేసేవారు. అదే గ్రామానికి చెందిన బోడా అర్జున్ ఇటీవల మృతి చెందడంతో శనివారం దశదిన కర్మ నిర్వహించారు. ఈ నేపధ్యంలో బోడా చిన్నా అనే వ్యక్తి తండాలోని ఓ బెల్టు దుకాణంలో రెండు మద్యం సీసాలను కొనుగోలు చేసి హరిదాసు, మల్సూర్, భద్రులకు ఇచ్చాడు. ఆ మద్యం తాగిన ఆ ముగ్గురూ కొద్దిసేపటి తరువాత స్పృహ తప్పి పడిపోయారు. భద్రు మద్యం తాగిన చోటే మృతి చెందగా.. మల్సూర్, హరిదాసులను చికిత్స కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. అయితే వారు కల్తీ మద్యం తాగి మృతి చెందారా? లేక విష ప్రయోగం జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.