Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒలంపిక్స్ లో పతకాలు తెచ్చిన వారు మనకు స్ఫూర్తి అని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని చెప్పారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానమని ప్రశంసించారు. కరోనా కారణంగా గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు ఇంకా కండ్ల ముందు కదులుతున్నాయి అని ప్రధాని అన్నారు. కరోనాతో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్లో మరణాలు తక్కువే అని చెప్పారు. దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతోందని ప్రధాని అన్నారు.