Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టర్కీ అడవుల్లో చెలరేగిన మంటలను అర్పేందుకు రష్యా నుంచి వచ్చిన యాంఫిబియస్ బెరివ్ బీఈఉ200 అగ్నిమాపక విమానం అదానా ప్రావిన్సులో కుప్పకూలింది. దాంతో 8 మంది మృతి చెందారు.
ప్రమాదాన్ని పరిశీలించేందుకు దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని టర్కీ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఈ ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలను టర్కీ మరచిపోదని అన్నారు. ప్రమాదానికి ముందు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని, ఆ తర్వాత విమానం కూలినట్టు తెలిసిందని స్థానిక గవర్నర్ ఒమర్ ఫరూక్ కోస్కున్ తెలిపారు. ఈ ప్రమాదం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. టర్కీకి మంటలను ఆర్పేందుకు తాము 200 విమానాలు పంపుతామని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.