Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రోజురోజుకు వివాహేతర సంబంధాలు హత్యలు దారితీస్తున్నాయి. తాజాగా హైదారాబాద్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోల్లారం ప్రాంతానికి చెందిన చౌహన్ ప్రఫూన్ ,జ్యోతిలు భార్యభర్తలు. అయితే చౌహన్ కు అదే ప్రాంతానికి చెందిన కృష్ణ స్నేహితుడు. స్నేహం ముసుగులో కృష్ణ తరచు చౌహన్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే చౌహాన్ భార్య జ్యోతికి కృష్ణతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరి సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని అతన్ని హత్య చేయాలని ఇద్దరూ భావించారు. ఈ క్రమంలోనే తన ఇంట్లోనే చౌహన్, కృష్ణలు కలిసి మద్యం తాగారు. భర్త స్నేహితుడితో వివాహేతరం సంబంధం..భర్తను గోనె సంచిలో కట్టి..ముందుకు అనుకున్న ప్లాన్ ప్రకారం చౌహాన్తో కృష్ణ ఘర్షణకు దిగి అతన్ని తీవ్రంగా కొట్టాడు.ఇక మద్యం మత్తులో ఉన్న చౌహాన్ ను జ్యోతి, కృష్ణలిద్దరూ చంపేశారు. ఆ తర్వాత శవాన్ని గోనే సంచిలో మూటగట్టి ఆటోలో వేసుకున్నారు. బొల్లారం నుండి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట జిల్లాలోని శనిగరం గుట్టల్లో శవాన్ని ఇద్దరు కలిసి పూడ్చిపెట్టారు. అనంతరం ఇంటికి చేరుకున్న జ్యోతి తన భర్త కనిపించడం లేదంటూ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు జ్యోతిపై అనుమానంతో ఆమె ఫోన్ కాల్లిస్టు చెక్ చేశారు. దాని ఆధారంగా హంతకులను నిర్ధారించారు. శనివారం ఇద్దరిని తీసుకుని శవం పాతిపెట్టిన చోటికి తీసుకెళ్లి పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.