Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే అది సాకారం అవుతుందన్నారు. ఎర్రకోట మీద జెండా ఎగరేసిన తర్వాత ఆయన ప్రసంగిస్తున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాలకు మధ్య ఉన్న అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణం కోసం పాటుపడాలని చెప్పారు. ఈ 25 ఏండ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతీ అడుగు కీలకమేనని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. ఇవే మన రణ నినాదం కావాలని చెప్పారు.
గత కొన్నేండ్లలో గ్రామాలు బాగా అభివృద్ధి చెందాయని తెలిపారు. రోడ్డు, విద్యుత్తు వంటి సదుపాయాలు ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. గ్రామస్థాయి లోనూ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు డిజిటల్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు అని మోడీ తెలిపారు. మన మన పరిశ్రమలలో వస్తువులతో పాటు గౌరవం కూడా తయారవుతోందనిల.. వ్యాపారులు అది గుర్తుంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త సంస్కరణలు అవసరం అని తెలిపారు.