Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో : 51,580 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా నమోదయ్యింది.