Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో రానున్న 48 గంటల్లో ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నేటి నుంచి రేపు ఉదయం వరకు రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కింది. అలాగే ఆగస్టు 16 ఉదయం నుంచి ఆగస్టు 17 ఉదయం వరకు.. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపంది. మళ్లీ ఆగస్టు 17 ఉదయం నుంచి ఆగస్టు 18 వరకు...కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 18 ఉదయం నుంచి ఆగస్టు 19 ఉదయం వరకు.. కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది.