#IndependenceDay Celebrations Live from Golconda fort. #IndiaIndependenceDay #IndiaAt75 https://t.co/LSYpD64kd4
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2021
Authorization
#IndependenceDay Celebrations Live from Golconda fort. #IndiaIndependenceDay #IndiaAt75 https://t.co/LSYpD64kd4
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2021
హైదరాబాద్ : రేపటి నుంచే రాష్ట్రంలోని ఆరు లక్షల మంది అన్నదాతల కు 50 వేల రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. దాంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతున్నారన్నారు.. మిగిలిన వారికి కూడా దశలవారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని.. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదన్నారు. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబర పడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటనూ ఇప్పటికీ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రం ఏర్పడే నాటి పరిస్థితులకు, నేటికి అసలు పోలికే లేదన్నారు. అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని ఆవిష్కరించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని చెప్పారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామన్నారు డ్ 2013 -2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు ఉండగా... 2020-2021లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లకు చేరిందన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదని చెప్పారు. 2013-2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126 కాగా.. నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉందని. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు.
దేశంలోనే తొలి సారిగా మెటర్నటీ ఐ.సి.యులను ఏర్పాటు చేసిందని.. చాలాచోట్ల మహిళల ప్రసూతి కోసమే ప్రత్యేక వైద్య శాలలు నెలకొల్పిందన్నారు. 102 అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి కూడా ప్రసవం కోసం గర్భిణులను దవాఖానాలకు తరలించే ఏర్పాటు చేసిందన్నారు. కాకతీయు కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం మనందరికీ గర్వకారణమన్నారు.