Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఉండడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో చట్టసభ్యులుగా ఉన్నవారిలో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారన్నారు. అప్పట్లో వారంతా ప్రతి అంశంపైనా విస్తృతంగా, నిర్మాణాత్మకంగా చర్చించి, చట్టాలు చేసేవారని చెప్పారు. చట్టాలపై స్పష్టత ఉండేదని.. దాంతో న్యాయస్థానాలపై కేసుల భారం తక్కువగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. చట్టాల్లో అనేక లోపాలు ఉంటున్నాయని చెప్పారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఉండడంలేదన్నారు. పార్లమెంటు చట్టాలు చేసే సమయంలో సరైన చర్చ జరుగుతున్నట్టు కనిపించడం లేదన్నారు. ఫలితంగా కేసులు ఎక్కువై.. ప్రభుత్వానికి, ప్రజలకు అసౌకర్యం కలుగుతోందన్నారు. సామాజిక, ప్రజా జీవితంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాల్సిన అవసర ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు