Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పోటిచేయనున్నట్టు తెలుస్తోంది. ఆయనను కేంద్ర హోంశాఖ బలవంతంగా పదవీ విరమణ చేయించడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ మేరకు ఆయన భార్య నూతన్ దీని పై మాట్లాడారు. యోగి ప్రభుత్వం పాలన అంతా అప్రజ్వామికంగా ఉందన్నారు. ఆయన పాలనకు ముగింపు పలికేందుకు తన భర్త అమితాబ్ ఠాకూర్.. యోగి ఆదిత్యానాథ్‌పై పోటీ చేస్తున్నారని తెలిపారు. యూపీలోని ఏ నియోజకవర్గం నుంచి యోగి పోటీ చేసినా.. అక్కడి నుంచే తన భర్త కూడా పోటీ దిగుతారని ఆమె స్పష్టం చేశారు.
ప్రజలకు హాని కలుగుతుందనే అభియోగాలతో అమితాబ్ ఠాకూర్‌ను గత మార్చి 23 న కేంద్ర హోం శాఖ బలవంతంగా రాజీనామా చేయించింది. ఆయన సర్వీసు 2028 వరకు ఉంది.