Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని హత్యకు గురైంది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లపు రమ్య అనే యువతి ఓ ప్రయివేటు కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతోంది. ఆదివారం పెదకాకాని రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆమె టిఫిన్ కోసం వెళ్లింది. ఆ సమయంలో ఓ యువకుడు.. టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి ఆమెను తన బైక్ ఎక్కాలని కోరాడు.అయితే ఆమె నిరాకరించింది దాంతో ఆ యువకుడు... ఆమెను పొట్ట, గొంతులో 6 చోట్ల పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన ఆమెను పోలీసులు, స్థానికులు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ హఫీజ్ దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.