Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఈ ఏడాది 31,168 కొత్త పిటిషన్లు దాఖలు కాగా.. 22,098 కేసులు పరిష్కారం అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. హైకోర్టులో ప్రస్తుతం 2 లక్షల 32 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టులో ఆదివారం ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెండాఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంతృప్తికరంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 46 కొత్త కోర్టులు, 2,170 అదనపు పోస్టులు, హైకోర్టులో 213 సూపర్ న్యూమ రరీ పోస్టులను మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి చర్యలు చేపట్టినట్టు వారు చెప్పారు. జడ్జీల నియామకానికి ఇటీవల కొన్ని పేర్లు పంపించినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తిగత చొరవతో హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగిం దన్నారు. రాష్ట్రంలో 33 జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై న్యాయమూ ర్తుల సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కరోనాతో 19 మంది ఉద్యోగులు, 208 మంది న్యాయవాదులు మరణించారని తెలిపారు. కొవిడ్‌తో మరణించిన కోర్టు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. కుటుంబాల్లోని అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టామని సీజే తెలిపారు.
దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష తొలగింపునకు.. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు తన భార్య జ్ఞాపకార్థం ఇచ్చిన అంబులెన్స్‌ను సీజే హిమా కోహ్లీ ఈ సందర్భంగా ప్రారంభించారు. హైకోర్టు కొవిడ్ సహాయ నిధి నుంచి పలువురు న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు పాల్గొన్నారు.