Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫోర్ట్ సెయింట్ జార్జిపై జాతీయ పతాకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారంనాడు ఎగురవేశారు. గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. డీఎంకే ప్రభుత్వం నేటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోగా, ముఖ్యమంత్రిగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేయడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ను రూ.17,000 నుంచి 18,000 పెంచుతున్నట్టు ప్రకటించారు. కుటుంబ పెన్షన్ రూ.8,500 నుంచి రూ.9,000 చేశామని చెప్పారు. మదురైలోని మహాత్మాగాంధీ మ్యూజియంను రూ.6 కోట్లతో పునరుద్ధరిస్తామని చెప్పారు.