Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో కాబూల్ ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. తాము శాంతియుతంగానే కాబూల్ వైపు వస్తున్నట్లు తెలిపారు.