Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (సోమవారం) నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని పేర్కొంది. ఇక, రేపు (సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న విద్యాకానుక’ను తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుక అందించనున్నారు.