Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ఒడిశాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో భారత భద్రతా సరిహద్దు దళాలు ( BSF ) సరికొత్త చరిత్ర సృష్టించాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిశా – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దట్టమైన అడవుల్లో బీఎస్ఎఫ్ దళాలు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి. స్థానికంగా ఉన్న మొహుపదార్ ఏరియా మావోయిస్టులకు అడ్డ. ఈ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసు బలగాలపై ఎన్నోసార్లు దాడులకు పాల్పడ్డారు. పాఠశాల, పంచాయతీ భవనాలతో పాటు పోలీసు స్టేషన్ను కొన్నేండ్ల క్రితం మావోయిస్టులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడ పూర్తిగా అభివృద్ధి కుంటు పడిపోయింది. స్థానిక గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచం తెలియకుండా మావోయిస్టులు కుట్ర చేశారు.