Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్ళిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబూల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ విమానం సుమారు గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టవలసి వచ్చింది. ఓ దశలో పైలట్ విమానం రాడార్ను స్విచాఫ్ చేశారు. ఈ విమానాన్ని శత్రువులు గుర్తించి, టార్గెట్ చేస్తారేమోననే ఉద్దేశంతో రాడార్ను స్విచాఫ్ చేశారు. ఉద్విగ్న వాతావరణంలో ఓ గంట ఆలస్యంగా ఎట్టకేలకు ఈ విమానం ల్యాండ్ అయింది.