Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హుజురాబాద్‌లో సోమవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దళితబంధు పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో రేపు కేసీఆర్ చేతులమీదుగా లాంఛనంగా 15 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను అందించనున్నారు. లక్ష మందితో జరగనున్న ఈ బహిరంగ సభలో కేసీఆర్ దళితుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం అమలు చేసే తీరును, చేపట్టిన, చేపట్టనున్న ఇతర కార్యక్రమాలను వివరించనున్నారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇంద్రానగర్‌లో 16న జరుగనున్న కేసీఆర్ బహిరంగ సభను మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో హుజురాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలతో హరీష్ రావు, గంగుల కమలాకర్ సమావేశమయ్యారు.