Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇంద్రానగర్‌లో సోమవారం జరిగే సీఎం సభకు సర్వం సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలోని స్టేజీపై సుమారు 250 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రెయిన్‌ఫ్రూఫ్ టెంట్లతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్-జమ్మికుంట రోడ్డు పక్కన గల శాలిపల్లి-ఇంద్రానగర్‌లో 20 ఎకరాల్లో 1.20లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దళితబంధు పథకం ఇవ్వడం కోసం మొదట్లో ఐదువేల కుటుంబాలను ఎంపిక చేశారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. నాలుగు రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం ఎంపికలో అనర్హులను కేటాయించారని నిరసన సెగలు తగలడంతో 15మందికి మాత్రమే సీఎం చేతుల మీదుగా దళితబంధు చెక్కులు అందజేయనున్నారు. రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సీఎం సభ జరుగనుంది.