Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌కు తాలిబన్లు చేరుకోవడంతో దేశం మొత్తం వారి హస్తగతమైంది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. కీలక బృందంతో కలిసి దేశం విడిచివెళ్లినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం తజికిస్తాన్‌కు వెళ్లిన అష్రఫ్, అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక అన్ని వైపుల నుంచి తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టినట్లు అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి మీడియాతో పేర్కొన్నారు. అయితే, అఫ్గాన్ సైన్యం, తాలిబన్లకు మధ్య కాల్పులు జరిగాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. తాలిబన్లు కాబూల్‌పై ఎలాంటి దాడి చేయలేదని, అధికారి మార్పు శాంతియుతంగా జరుగుతుందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ శాంతియుతంగా ముగిసే వరకూ కాబూల్‌కు అన్ని ప్రవేశ మార్గాల వద్ద తాలిబన్ సైన్యం వేచి ఉంటుందని వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని ప్రత్యేక హెలికాప్టర్లో తరలించింది. మరోపక్క తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.