Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: గుంటూరు జిల్లాలో రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్యకు గురికావడం పట్ల సీఎం జగన్ స్పందించారు. ఇవాళ గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిందితుడికి కఠినశిక్ష పడాలని స్పష్టం చేశారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.