Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కలకలం రేపింది. నాలుగో రోజు సెకండ్ సెషన్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బంతిని బూట్ల కింద పెట్టి దాని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడో రోజు ఆటలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు సహకరించింది. బౌలర్లు ఎంత ప్రయత్నించిన బంతిని స్వింగ్ చేయలేకపోయారు. దీనిని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, బంతిని బూట్ల కింద పెట్టి దానిని ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు అంపైర్ల దృష్టిని ఆకర్షించాయి. బంతిని ట్యాంపర్ చేసేందుకు మూడుసార్లు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంపై ఇంగ్లండ్ బోర్డు వివరణ ఇస్తుందో, లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఆట చక్కగా కొనసాగుతోంది. కాగా, ఇది కచ్చితంగా బాల్ట్యాంపరింగ్ ప్రయత్నమేనంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా దీనిపై స్పందించాడు. చూస్తుంటే బాల్ ట్యాంపరింగ్లానే ఉందని అభిప్రాయపడ్డాడు.