Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. దీంతో కాబూల్‌లో ఉద్రిక్త, భయానక వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలు దిల్లీ-కాబూల్ మధ్య నడిచే విమాన సర్వీసులపై పడ్డాయి. ‘ప్రస్తుతం అఫ్గాన్‌లో వేగంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. భారత రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కాబూల్‌లోని భారత పౌరుల ప్రాణాలను పణంగా పెట్టం’ అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. వారిని అవసరమైన సమయంలో స్వదేశానికి తరలించే ఏర్పాట్లతో ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన C-17 విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.