Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. 50 వేల లోపు రుణాలను నేటి నుంచి మాఫీ చేయనున్నారు. దాంతో 6,06,811 మంది రైతులకు 2005.85 కోట్ల రూపాయల మేర లబ్ది జరగనుంది. రుణమాఫీ నిధుల విడుదలకు
రుణమాఫీ ప్రక్రియలో ఈసారి కొత్త విధానం అమలు చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.. సోమవారం తొలిరోజున రూ.25 వేలు- రూ. 26 వేల మధ్య బాకీ ఉన్న రైతుల ఖాతాలకు నిధులు జమ చేస్తారు. రెండోరోజు రూ.26 వేల నుంచి రూ. 27 వేలు, మూడోరోజు రూ.28 వేలు ఇలా రోజుకు రూ.వెయ్యి చొప్పున పెంచుతూ ఈ నెల 30కల్లా మొత్తం రూ.50 వేల లోపు బాకీలన్నింటికీ నిధులు జమ చేస్తామని తెలిపారు. అందుకు రూ.2005.85 కోట్లను ప్రభుత్వం వ్యవసాయశాఖకు ఇప్పటికే విడుదల చేసిందన్నారు.