Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి దళితబంధు పథకం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పేద దళితులకు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వంద శాతం రాయతీతో అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించగా.. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ పద్ధతిలో దీన్ని ప్రారంభిస్తున్నారు.
దళితబంధు అమలు కోసం ఇప్పటికేఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో ఎస్సీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు నవీన్ నికోలస్, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, ఆర్డీవోలు విక్టర్ (ఆందోల్), అమరేందర్ (వనపర్తి), కృష్ణవేణి (స్టేషన్ ఘన్పూర్), రమేష్ (తొర్రూర్), మేడ్చల్ డీఆర్డీఏ పీడీ పద్మజారాణిలు ఉన్నారు.