Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: లార్డ్స్‌లో జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ రెండు టెస్టు నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్టు కోల్పోయి 181 పరుగులు చేసింది. ప్రస్తుతం 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో రిషబ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) ఉన్నారు.ఐదో రోజు భారత్ త్వరగా ఆలౌట్ అయితే ఇంగ్లాండ్ విజయం సులభతరమవుతుంది. లేదా భారత్ ప్రతిఘటిస్తే డ్రాకు, భారత్ గెలుపునకు ఆవకాశం ఉంటుంది. అయితే ఒకే రోజు భారత బౌలర్లు 10 వికెట్లు తీయడం కష్టమే. మరో వైపు ఇంగ్లాండ్ ముందు 220 పరుగులు పైన లక్ష్యం ఉంటే వారికి కష్టం కానుంది.
నాలుగో రోజు మొదటి మూడు వికెట్లు త్వరగానే ఇంగ్లాండ్ తీసుకోవడంతో భారత శిబిరంలో కలవరం మొదలైందిక. అయితే అజింక్య రహానే (146 బంతుల్లో 61, 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45, 4 ఫోర్లు)లు జట్టును ఆదుకున్నారు. అనంతరం ఇద్దరూ అవుటవ్వగా.. జడేజా కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. దాంతో భారత్ కష్టాల్లో పడింది. చివరి రోజు పంత్, టెయిలెండర్లు ఎంత వరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.