Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో మద్యం తాగారన్న ఆరోపణలపై విజయ్ విహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ)ను వెస్ట్ డీసీపీ సస్పెండ్ చేశారు. దాంతో పాటు నూతన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై వెస్ట్ ఢిల్లీలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లోని అధికారుల గదులను చెక్ చేస్తామని తెలిపారు. ఒకవేళ ఏ గదిలోనైనా మద్యం బాటిల్ కనిపిస్తే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే స్టేషన్లలో రాత్రిళ్లు విధులు నిర్వహించే అధికారులు ఎవరైనా మద్యం మత్తులో కనిపించినా వారిపై చర్యలు చేపడతామన్నారు.