Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరేబియన్ ద్వీప దేశం హైతీలో శనివారం తెల్లవారు జామున రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అందులో మృతుల సంఖ్య 1,300 మందికి పెరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చాలా మందికి గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమవడంతో భవనాల కింద శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అమెరికా సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను మోహరించింది.
భూకంపం ప్రభావంతో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి భారీగా మట్టిపెళ్లలు వంటివి విరిగిపడటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది.