Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మూఢనమ్మకాలతో ఎందరో బలవుతుండడం మనం చూస్తున్నం. ఇది మనదేశంలోనే కాదు విదేశాల్లోను ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో తన పిల్లలు రాక్షసులుగా మారతారని.. ప్రపంచాన్ని రక్షిస్తానని వారి తండ్రే వారిని హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన మాథ్యూ టేలర్ కోల్మన్(40) ఇటీవల తన పిల్లలను( 2 ఏండ్లు క్యాంపింగ్‌కు తీసుకెళ్తున్నానని తన భార్య చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అయితే అనంతరం ఆమె మెసేజ్‌లు, కాల్లు చేసినపుడు అతను సమాధానం ఇవ్వలేదు. దాంతో అనుమానంతో అతని భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. గా పోలీసు అధికారులు అతడి ఫోన్‌ని ఫైండ్ మై ఐఫోన్ యాప్ ద్వారా ట్రాక్ చేశారు. అతను మెక్సికోలోని రోసారిటోగాలో చివరిగా ఉన్నట్లు చూపించింది. దీంతో అప్రమతమైన ఎఫ్బిఐ అతడిని పట్టుకుని ప్రశ్నించారు. అప్పుడు టేలర్ కోల్మన్ దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పాడు. తన భార్య సర్పెంట్ డీఎన్ఏ ను తన పిల్లలు కలిగి ఉన్నారని దాంతో వారు భవిష్యత్తులో రాక్షసులుగా మారుతారని తానే వారిని ఈటెల ఫిషింగ్ గన్‌తో చంపినట్టు తెలిపాడు. వారి మృతదేహాలను మెక్సికోలో పడేశానని చెప్పాడు. భవిష్యత్తులో ప్రపంచం రాక్షసులతో నిండి ఉంటుందని క్యూఆనన్, ఇతర కుట్ర సిద్ధాంతాల ద్వారా జ్ఞానోదయం పొందాననిట్టు కావున లోకాన్ని రక్షించే చర్యగా పిల్లలను చంపానని కోల్మన్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం పిల్లల మృతదేహాలను మెక్సికో అధికారులు కనుగొన్నారు. పిల్లల వయసు ఒకరికి రెండ ఏండ్లు కాగా, మరొకరు 10 నెలలు. ఇదిలా ఉండగా టేలర్ కోల్మన్ ఇలా చేసాడంటే నమ్మలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు.