Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దళితబంధును ప్రారంభించేందుకు నేడు సీఎం కేసీఆర్ .. హుజూరాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని సీఎం లాంఛనంగా అక్కడ ప్రారంభిస్తారు. అయితే కొద్ది రోజుల్లో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం షెడ్యూల్..
సోమవారం మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం హెలికాప్టర్లో బయల్దేరతారు. 2 గంటలకు సభాస్థలికి చేరతారు. సాయంత్రం 4 గంటల వరకు సభలో పాల్గొని తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ..
హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇంద్రానగర్‌లోని సభలో దళిత బంధును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సభలో 15 మంది లబ్ధిదారులకు సీఎం లాంఛనంగా చెక్కులు పంపిణీ చేస్తారు. అయితే ఈ సభకు జర్మన్ హంగర్ టెక్నాలజీతో ఏర్పాట్ల పూర్తి చేశారు. ఎంత భారీవర్షం పడినా, గాలులు వీచినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినా ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, హనుమకొండ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.