Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దానిపై ఫేస్బుక్ వేదికగా స్పందించారు. రక్తపాతాన్ని నివారించడానికి తాను దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలిపారు. కత్తులు, గన్లతో దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఇకపై అఫ్గాన్ ప్రజల గౌరవం, సంపద, పరిరక్షణ బాధ్యత చూస్తారన్నారు. . గడిచిన 20 ఏళ్లుగా దేశ రక్షణకు తన జీవితాన్ని అంకితం చేసినట్టు తెలిపారు.దేశాన్ని విడిచిపెట్టడమనే కఠిన నిర్ణయం తనను బాధించిందన్నారు.
భీకర పోరులో గెలిచి దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. అఫ్గాన్ ప్రజల హృదయాలను గెలుచుకోలేకపో యారని అన్నారు. పరిస్థితిని అదుపు చేయకుండా వదిలేస్తే.. భారీ సంఖ్యలో దేశభక్తులు అమరులవుతారని, ఫలితంగా 60 లక్షల జనాభా ఉన్న కాబూల్ నగరం నాశనమవుతుందన్నారు.