Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రియురాలిపై ఇనుపరాడ్ తో ప్రియుడి తల్లి దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అరవింద్నగర్కు చెందిన సాప భరత్‌చంద్ర(26), మోచీబజార్‌కు చెందిన బోగని శ్రావణి(21)లు ప్రేమించుకుంటున్నారు. శ్రావణికి తల్లిదండ్రులు లేరు. ఆమె అన్నవదినల వద్ద ఉంటూ డిగ్రీ చదువుతోంది. భరత్‌చంద్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా భరత్‌చంద్ర తల్లిదండ్రులుగా అతనికి ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈనెల 27న వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో భరత్‌చంద్ర, శ్రావణిలు ఈనెల 9న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. తల్లిదండ్రులు భరత్‌చంద్రకు ఫోన్ చేసి ప్రేమించిన యువతితోనే వివాహం జరిపిస్తామని నమ్మించి ఇంటికి పిలిపించారు. ఇంటికొచ్చాక శ్రావణి తలపై భరత్ చంద్ర తల్లి ఇనుపరాడ్‌తో కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ యువతి అరుచుకుంటూ ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. స్థానికులు వెంటనే 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.