Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దళితబంధు పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ నేడు హుజూరాబాద్‌కు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే..హుజూరాబాద్ మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో సీఎం సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. స్పందించిన అధికారులు వెంటనే కంకరతో గుంతలను పూడ్చివేయిస్తున్నారు. బురద మయమైన మట్టి రోడ్డుపై కంకర వేసి లెవలింగ్ చేయిస్తున్నారు.
ఇదిలా ఉండగా కుంభవృష్టి పడ్డ సీఎం సభ జరుగుతుందని, జర్మనీ టెక్నాలజీతో సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లు చేశామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటికే గ్రామాలు, దళిత కాలనీల్లోకి బస్సులు చేరుకున్నాయని, మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభా ప్రాంగణానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.