Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమ సినిమాకు సంబంధించిన మెటిరియల్ తరచుగా లీక్ అవుతుండడంతో మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట టీజర్‌ను ఉదయం 9 గంటల సమయంలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావించారు. కానీ అంతకంటే ముందే ఆ టీజర్ లీక్ అయింది. అలాగే అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని దాక్కో దాక్కో మేక్ణ పాట కూడా ముందుగా చెప్పిన సమయం కంటే ముందుగానే లీకైంది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.సదరు సినిమాల టీజర్, పాటలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ మాట్లాడుతూ తమ సినిమాలకు సంబంధించిన మెటీరియల్ లీక్ కావడంపై తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులుకు ఫిర్యాదు చేశామని, ఈ పైరసీకి పాల్పడిన వారు ఎంతటి వారైన పట్టుకొని శిక్షించాలని కోరారు. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.