Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జార్ఖండ్ లోని ధన్బాద్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆగస్టు 15 సందర్భంగా జెండా ఆవిష్కరించి వెంటనే గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్కుండా బ్లాక్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ ఆదివారం జెండా వందన కార్యక్రమానికి వచ్చారు అందర్నీ పలకరిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏండ్లు అయిపోయిందంటూ చరిత్రపై మాట్లాడారు. అనంతరం జెండా ఎగరేసి దాన్ని చూస్తూ సెల్యూట్ చేశారు. అంతే ఆ వెంటనే ఒక్కసా రిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అక్కడున్నవారు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. దాంతో స్థానికంగా విషాదం నెలకొంది ఈ ఘటన